logo
logo
Sign in

Big Boss Ariyana Glory Bags A Role In Mega Hero Kalyaan Dhev Movie

avatar
seosmsakshi
Big Boss Ariyana Glory Bags A Role In Mega Hero Kalyaan Dhev Movie

 

మెగా హీరో సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన బోల్డ్‌ బ్యూటీ

 
Bigg Boss Lady Ariyana Glory Plays Role In Kalyaan Dhevs Film - Sakshi

యాంకర్‌గా కేరీర్‌ మొదలు పెట్టిన అరియానా గ్లోరీ బిగ్‌బాస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్‌లో ముక్కసూటి వైఖరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ బిగ్‌బాస్‌ తర్వాత ఫుల్‌ బిజీగా మారింది. యాంక‌ర్‌గా రామ్‌ గోపాల్‌ వర్మ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు వెండితెరపై మెరవనున్నట్టు సమాచారం. ఇప్పటికే యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌తో కలిసి అరియానా ఓ సినిమాలో నటిస్తుంది. ఆ మధ్య దీనికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్‌ చేసింది. అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే.. అరియానా మరో బంపర్‌ ఆఫర్‌ దక్కించుకుంది. మెగా హీరో కల్యాణ్ దేవ్ సినిమాలో అరియానా నటిస్తుంది.

 

శ్రీధర్ సీపన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ దేవ్‌కు చెల్లి పాత్రలో అరియానా కనిపించనుంది. స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. నమో వెంకటేశ, దూకుడు సహా పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీధర్ సీపన ఈ సినిమకు దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చిన విజేత సినిమాతో కల్యాణ్‌ దేవ్‌ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన ‘సూపర్ మాచి’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. 

చదవండి : (బిగ్‌బాస్‌ భామ అరియానకు అరుదైన ఘనత)
(ఆచార్య’ సెట్‌లో సందడి చేయనున్న మెగా కోడలు)

 

 
 
 
Read latest Movies News and Telugu News | Follow us on FaceBookTwitterTelegram
collect
0
avatar
seosmsakshi
guide
Zupyak is the world’s largest content marketing community, with over 400 000 members and 3 million articles. Explore and get your content discovered.
Read more